ఫ్యాన్స్‌కు రేపు సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్న ప్రభాస్...
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాహుబలి’ పార్ట్ 1, పార్ట్2 సినిమాలతో రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు. అందుకే ప్రభాస్‌తో సినిమా తీయాలంటే అదే రేంజ్‌లో తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్‌లో రెబల్ స్టార్ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
మునుపెన్నడూ చూడని విధంగా కానీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇప్పటికే చిత్రయూనిట్ చెప్పేసింది. ‘సాహో’ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ‘సాహో’ సినిమాకు సంబంధించి అప్డేట్ రాక చాలా రోజులైంది. అయితే సాధారణంగానే స్టార్ హీరోల సినిమా అప్‌డేట్స్ అంటే అటు అభిమానుల్లో, సినీ ప్రియుల్లో.. సినీ ఇండస్ట్రీలోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. తాజాగా అలాంటి సందర్భమే ఒకటి జరిగింది. రెబల్ స్టార్ తన అభిమానులు, సినీ ప్రియులకు సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ ఓ వీడియోను విడుదల చేశారు.
వీడియోలో ఏముంది..!?
"హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు? మీకోసం రేపు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజీ చూడండి" అంటూ వీడియోలో ప్రభాస్ తెలిపారు. అయితే డార్లింగ్ ఇవ్వబోయే ఆ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుంది..? ఇంతకీ సాహోకు సంబంధించిన అప్డేటేనా..? లేకుంటే ఇంకేమైనా ఉంటుందా..? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. డార్లింగ్ తొందరగా చెప్పేయ్.. రేపటి దాకా మళ్లీ వెయిట్ చేయాలా.. ఇప్పుడే చెప్పేయచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ సర్‌ఫ్రైజ్ ఏదో తెలియాలంటే మంగళవారం వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com