మళ్లీ వార్తల్లోకి ప్రభాస్ పెళ్లి..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒకరైన ప్రభాస్ పెళ్లి గురించి ఎక్కడా ఊసెత్తం లేదు. నాలుగు పదుల వయసును ఈ స్టార్ రీచ్ కాబోతున్నాడు. `బాహుబలి` తర్వాత ఇంటర్నేషనల్ గుర్తింపును సాధించుకున్నారు. త్వరలోనే `సాహో` చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మరి ఈ చిత్రం తర్వాత అయినా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా? అని అభిమానులు వేచి చూస్తున్నారు. లేటెస్ట్గా ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తొకటి హల్ చల్ చేస్తుంది. అమెరికాలో సెటిల్ అయిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని ఆ వార్త సారాంశం. మరి ఈ వార్తలపై ప్రభాస్ కుటుంబ సభ్యులు, పీఆర్ టీమ్ ఎలా స్పందించనుందో చూడాలి. ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన `సాహో` ఆగస్ట్ 30న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments