హాలీవుడ్ వెళ్తున్న ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌ని స్టంట్ మాస్టర్స్ స్టడీ చేయాలనుకుంటున్నారు. వాళ్లకు అనువుగా ఉండేలా ప్రభాస్ హాలీవుడ్‌కి వెళ్తున్నారు. అదీ ఏకంగా మూడు వారాలు. ప్రభాస్ ఫ్రస్తుతం నటిస్తున్న సినిమా 'సాహో'. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి స్కోప్ మరింత ఎక్కువగా ఉంటుంది. అంత ఇంటెన్స్ ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ చేయాలంటే పర్ఫెక్ట్ టైమింగ్ ముఖ్యం.
ఆ టైమింగ్ ప్రభాస్‌లో ఏ రకంగా ఉంది? ఆయన బాడీ స్టైల్‌కి ఎలాంటి సినిమాలు సూట్ అవుతాయి? వంటి అంశాలను వాళ్లు స్టడీ చేయనున్నారు. దాదాపు రూ.150కోట్ల వ్యయంతో బహుభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో స్టంట్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. త్వరలోనే దుబాయ్ షెడ్యూల్ మొదలుకానుంది.
బుర్జ్ ఖలీఫా సమీపంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. 'సాహో' చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, శ్రద్ధాకపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com