హాలీవుడ్ వెళ్తున్న ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

ప్ర‌భాస్ బాడీ లాంగ్వేజ్‌ని స్టంట్ మాస్ట‌ర్స్ స్ట‌డీ చేయాల‌నుకుంటున్నారు. వాళ్ల‌కు అనువుగా ఉండేలా ప్ర‌భాస్ హాలీవుడ్‌కి వెళ్తున్నారు. అదీ ఏకంగా మూడు వారాలు. ప్ర‌భాస్ ఫ్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా 'సాహో'. ఈ సినిమాలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ కి స్కోప్ మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. అంత ఇంటెన్స్ ఉన్న యాక్ష‌న్ ఎపిసోడ్స్ చేయాలంటే ప‌ర్ఫెక్ట్ టైమింగ్ ముఖ్యం.

ఆ టైమింగ్ ప్ర‌భాస్‌లో ఏ ర‌కంగా ఉంది? ఆయ‌న బాడీ స్టైల్‌కి ఎలాంటి సినిమాలు సూట్ అవుతాయి? వ‌ంటి అంశాల‌ను వాళ్లు స్ట‌డీ చేయ‌నున్నారు. దాదాపు రూ.150కోట్ల వ్య‌యంతో బ‌హుభాషా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ కెన్నీ బేట్స్ ఆధ్వ‌ర్యంలో స్టంట్ సీక్వెన్స్ తెర‌కెక్కించ‌నున్నారు. త్వ‌ర‌లోనే దుబాయ్ షెడ్యూల్ మొద‌లుకానుంది.

బుర్జ్ ఖ‌లీఫా స‌మీపంలో ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. 'సాహో' చిత్రానికి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్‌, శ్ర‌ద్ధాక‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

'అర్జున్‌రెడ్డి' త‌మిళ టైటిల్ ఏంటో తెలుసా?

ఈ ఏడాది తెలుగులో విడుద‌లైన అర్జున్ రెడ్డి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ సినిమా 5 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంది 50 కోట్లు క‌లెక్ట్ చేసి పెద్ద హిట్ అయ్యింది.

నవంబ‌ర్ 24న 'హేయ్ ..పిల్ల‌గాడ‌'

'ఓకే.. బంగారం' స‌క్సెస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గరైన క‌థానాయ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు మూవీ మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

'ఖాకి' పాటలకు అద్భుతమైన స్పందన

అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు అని అంటారు. పెళ్లి ముందు జరిగే నిశ్చితార్థాన్ని బట్టి పెళ్లి ఎంత ఘనంగా ఉండబోతోందో అంచనా వేయొచ్చంటారు.

మ‌నోజ్‌కి ఆరు నెల‌లు రెస్ట్‌

మంచు మనోజ్ హీరోగా రేపు రిలీజ్ కాబోతున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ సంద‌ర్భంగా మ‌నోజ్ మాట్లాడుతూ "ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, రొమాన్స్, కామెడీ ఏ విధమైన హంగులు లేని సినిమా.

ప్ర‌ముఖ కెమెరామెన్ క‌న్న‌మూత‌...

సూర్య, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సింగం సిరీస్ సినిమాల‌కు సూర్య‌, హ‌రిల‌కు ఎంత మంచి పేరొచ్చిందో..సినిమాటోగ్రాఫ‌ర్ ప్రియ‌న్‌కి కూడా అంతే మంచి పేరు వ‌చ్చింది.