మరింత ఫిట్‌నెస్‌తో ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
'బాహుబలి' సిరీస్‌తో జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్నారాయన. యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. సినిమాలోని పాత్రకు తగ్గట్టు తన శరీరాకృతిని మార్చుకునే యంగ్ రెబల్ స్టార్.. ఆ మధ్య 'బాహుబలి' సిరీస్ కోసం బాగా బరువు పెరిగారు. ఇక తదుపరి చిత్రం 'సాహో' కోసం పాత్ర పరిధి మేరకు బరువు తగ్గవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు చేసి.. ముందుకన్నా మరింత ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారు ప్రభాస్. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తుండడంతో.. ప్రభాస్ అభిమానుల్లో ఆనందం రెట్టింపవుతోంది.
ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం.. ఆ మధ్య అబుదాబిలో అనుమతులు ఆలస్యం కానుండడంతో.. రామోజీ ఫిలింసిటీలో ఆ సీన్స్ ను చిత్రీకరించ తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పరిమితులు లభించడంతో.. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల మూడవ వారం నుంచి అబుదాబిలో చిత్రీకరించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com