మ‌రింత ఫిట్‌నెస్‌తో ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Sunday,March 11 2018]

'బాహుబలి' సిరీస్‌తో జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్నారాయ‌న‌. యూవీ క్రియేషన్స్ సంస్థ‌ ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. సినిమాలోని పాత్ర‌కు త‌గ్గ‌ట్టు తన శరీరాకృతిని మార్చుకునే యంగ్ రెబ‌ల్ స్టార్.. ఆ మ‌ధ్య‌ 'బాహుబలి' సిరీస్ కోసం బాగా బరువు పెరిగారు. ఇక తదుపరి చిత్రం 'సాహో' కోసం పాత్ర పరిధి మేరకు బరువు తగ్గవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు చేసి.. ముందుకన్నా మరింత ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారు ప్రభాస్. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తుండడంతో.. ప్రభాస్ అభిమానుల్లో ఆనందం రెట్టింపవుతోంది.

ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం.. ఆ మధ్య అబుదాబిలో అనుమతులు ఆలస్యం కానుండడంతో.. రామోజీ ఫిలింసిటీలో ఆ సీన్స్ ను చిత్రీకరించ తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పరిమితులు లభించడంతో.. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల మూడవ వారం నుంచి అబుదాబిలో చిత్రీకరించనున్నారు.

More News

మార్చ్ 23న విడుదల కానున్న 'నీది నాది ఒకే కథ'

శ్రీ విష్ణు హీరో గా నటించిన 'నీది నాది ఒకే కథ' చిత్రం మార్చ్ 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు.

మ‌రోసారి ల‌వ‌ర్ బాయ్‌గా అఖిల్‌?

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా రెండు సినిమాల్లో నటించినా.. అవి కెరీర్ పరంగా ఏ మాత్రం సాయపడలేక పోయాయి. తొలి చిత్రం 'అఖిల్' కెరీర్లోనే డిజాస్టర్‌గా మిగలగా.. రెండో చిత్రం 'హలో'కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర  అనుకున్నంత సందడి చేయలేకపోయింది.

రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు?

కొంత కాలం స్తబ్దుగా ఉన్న కెరీర్‌ను.. సెకండ్ ఇన్నింగ్స్‌లో భిన్నమైన పాత్రలతో పరుగులు పెట్టిస్తున్నారు జగపతి బాబు. ఓ పక్క తండ్రి పాత్రలు పోషిస్తూనే.. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రతినాయకుడి పాత్రల్లో హీరోకి ధీటుగా నటించి మెప్పిస్తున్నారు ఈ సీనియ‌ర్ క‌థానాయ‌కుడు.

మెగా బ్ర‌ద‌ర్స్ విల‌న్‌తో ర‌వితేజ?

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు 'దూకుడు', 'బాద్‌షా' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించి టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు దర్శకుడు శ్రీను వైట్ల. ఆ తర్వాత కాలం క‌లిసిరాక‌.. హ్యాట్రిక్ పరాజయాలతో బాగా వెనకపడిపోయారు.

అను ఇమ్మాన్యుయేల్‌కు అంకుల్‌గా..

1998లో విడుద‌లైన‌ 'గ్రీకువీరుడు' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావు త‌న‌యుడు దాసరి అరుణ్ కుమార్. దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోలేక‌పోయింది. అంతేగాకుండా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అరుణ్‌కు తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి.