అభిమానులకు ప్రభాస్ థాంక్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ సినిమాలోనే 1000 కోట్లు సాధించిన తొలి చిత్రం `బాహుబలి-2`. బాలీవుడ్ సినిమాల రికార్డలన్నింటినీ తిరగరాసిన ఈ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా ప్రేక్షకులను మెప్పించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ విజయంతో పట్టరాని సంతోషంతో ఉన్నాడు.
ప్రస్తుతం అమెరికాలో సమ్మర్ హాలీడేను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్, ఫేస్బుక్ ద్వారా అభిమానులకు థాంక్స్ చెప్పాడు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు థాంక్స్, ఇండియాలోనే కాదు,విదేశాల్లో కూడా అభిమానుల ఆదరణ పొందడానికి నా వంతు ప్రయత్నం చేశాను. బాహుబలి అనే సుదీర్ఘ ప్రయాణంలో అభిమానులైన మీరంతా నాకు తోడుగా ఉన్నారు. జీవితాంతం ఈ ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేసిన రాజమౌళిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com