ప్రభాస్‌కు తప్పేలా లేదు!!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గకపోయినా ప్రభుత్వాలు కొన్ని విధి విధానాలను ఏర్పాటు చేసి ఆ మేరకు షూటింగ్స్ చేసుకోవచ్చునని తెలియజేశారు. అయితే ఈ నియమాలు పెద్ద బడ్జెట్ చిత్రాలకు పెద్ద అడ్డంకిగా మారాయి. ఎందుకంటే ప్రభుత్వ నియమాల ప్రకారం లొకేషన్‌లో 40 నుండి 50 మంది మాత్రమే ఉండాలి. కానీ.,.. పెద్ద సినిమాలకు కనీసం 200 నుండి 300 మంది అవసరం అవుతారు. సరే! చూద్దాం తక్కువ మందితో షూటింగ్ ఎలా చేయవచ్చునో అని రాజమౌళి ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు వచ్చిన అవుట్‌పుట్ శాటిస్పాక్షన్‌గా అనిపించలేదు. దీంతో రాజమౌళి తన ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ షూటింగ్‌ను మరికొన్ని రోజులు వెనక్కి తీసుకెళ్లారు.
ఇది కాకుండా ఇంకా చాలా పెద్ద చిత్రాలు సైలెంట్‌గా అసలేం జరగుతుందోనని వేచి చూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభాస్ తన 20వ చిత్రం ‘రాధేశ్యామ్’ కోసం విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారట. అదేంటి ఇక్కడే సెట్ వేసి తీస్తారని వార్తలు వినిపించాయిగా అనే అనుమానం రాకమానదు. అయితే.. ప్రభాస్ అండ్ టీమ్ ప్రభుత్వం విధించిన నియమ నిబంధనల్లో షూటింగ్స్ ఇక్కడైతే షూటింగ్ చేయలేమని భావిస్తున్నారట. అదే విదేశాల్లో అయితే ఇలాంటి నిబంధనలు ఏమీ లేవు. అక్కడ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తే వారు ముందు ప్లాన్ చేసుకున్న అవుట్ పుట్ వస్తుంది. ఒకవేళ అక్కడి లొకేషన్స్‌ను ఇక్కడ సెట్స్‌లా వేసి తీస్తే మళ్లీ గ్రాపిక్స్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇదంతా నిర్మాతకు భారమే కాబట్టి.. ప్రభాస్ అండ్ టీమ్ యూరప్ వెళితేనే బెటర్ అని భావిస్తున్నారని టాక్. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments