మొన్న యూనిట్‌కు.. ఈసారి ఫ్యాన్స్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్!

  • IndiaGlitz, [Monday,January 18 2021]

రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణం.. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ తప్ప హీరోలంతా తమ అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. కానీ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ టీజర్ నిజానికి నూతన సంవత్సర కానుకగా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అప్పుడు రాలేదు సరికదా.. కనీసం సంక్రాంతికైనా వస్తుందనుకుంటే అది కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చిత్ర యూనిట్‌కి రిస్ట్ వాచ్‌లను గిఫ్టుగా ఇచ్చి సంతోష పెట్టిన ప్రభాస్.. అభిమానులను మాత్రం నిరాశ పరిచాడు.

తాజాగా ప్రభాస్ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట. అతి త్వరలో రాధేశ్యామ్ నుంచి అభిమానులకు ఓ గిఫ్ట్ రానుందని సమాచారం. ఇదే క్రమంలో అభిమానులకు కూడా ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. అతి త్వరలో ఈ సినిమా నుంచి ఓ క్యూట్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ గ్లింప్స్‌తో అభిమానులను ప్రభాస్ ఖుషీ చేయనున్నాడు. ఇప్పటికే ప్రభాస్ బర్త్ డే కానుకగా అక్టోబర్ 23న వదిలిన ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ను అభిమానులెవరూ మరచిపోలేరు. అంతటి అద్భుతమైన వీడియోను వదిలారు. మరి ఇప్పుడు విడుదల చేయబోయే ఈ గ్లింప్స్‌ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా.. తాజాగా విడుదల చేయబోయే గ్లింప్స్‌లో హీరో, హీరోయిన్‌లు ఇద్దరూ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్స్‌ ఎలా ఉంటాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారైనా చెప్పిన విధంగా గ్లింప్స్‌ విడుదల చేస్తారా.. లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ రూపొందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమచారం.

More News

యూపీలో టీకా తీసుకున్న మరుసటి రోజే వార్డు బాయ్ మృతి

వ్యాక్సినేషన్ డ్రైవ్‌ తొలిరోజు టీకా తీసుకున్న వార్డు బాయ్ ఆ మరుసటి రోజే మృతి చెందడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు...

అనేక గొప్ప సినిమాకు టాలీవుడ్‌కు అందించిన ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు.

కేసీఆర్ యాగం.. ఆ వెంటనే కేటీఆర్‌కు సీఎం యోగం..!

తెలంగాణలో కీలక మార్పు జరగనుందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

‘జెర్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. గౌతమ్‌కి హిట్ దక్కేనా?

బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ ఇప్పుడు టాలీవుడ్‌కు ద‌గ్గ‌ర‌వుతుంది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న సినిమాల‌ను హిందీలో రీమేక్ చేయ‌డం కాదు..

ప‌ని పూర్తి చేసిన పూజా హెగ్డే

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే రాధేశ్యామ్ తాజా షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ముప్పై రోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.