ప్రభాస్ సర్‌ప్రైజ్ వచ్చేసింది

  • IndiaGlitz, [Wednesday,October 21 2020]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. రేపు ప్రభాస్ సర్‌ప్రైజ్ రాబోతోందని షూటింట్ స్పాట్ నుంచి నిన్న పూజా హెగ్డే ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు చాలా ఆసక్తిగా ఆ సర్‌ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్నారు. బుధవారం అభిమానులు ఎదురు చూస్తున్న సర్‌ప్రైజ్ రానే వచ్చింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ‘రాధేశ్యామ్’ నుంచి ప్రభాస్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నట్టు పోస్టర్ ద్వారా చిత్రబృందం వెల్లడించింది. గ్రీన్ కలర్ కారుపై ప్రభాస్ కూర్చొన్నట్టుగా ఈ పోస్టర్‌ను చిత్రబృందం డిజైన్ చేసింది.

వింటేజ్ ప్రేమకథగా ‘రాధేశ్యామ్’ తెరకెక్కుతోంది. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తోంది. ఇవాళ ప్రభాస్ క్యారెక్టర్ పేరు కూడా రివీల్ అయిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భాగ్యశ్రీ, సత్యరాజ్, జగపతిబాబు, జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ బాషల్లో రూపొందుతోంది. నెలాఖరుకు ఇటలీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చిత్రబృందం హైదరాబాద్‌కు తిరిగి రానుంది.

More News

ట్రెండింగ్‌లో ప్రభాస్ సీడీపీ.. సర్‌ప్రైజ్ అంటున్న పూజా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు మరో రెండు రోజుల్లో రాబోతోంది. దీని కోసం ప్రభాస్ అభిమానులు ఇప్పటికే సిద్ధమయ్యారు. క్యాజువల్‌గా అయితే కేక్ కటింగ్‌లు, రక్తదానాలు

సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి విరాళం

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని ప్రతి ప్రాంతంలోని ఎంతో కొంత భాగం నీట మునిగింది. ఇక పాతబస్తీ అయితే చాలా వరకూ జల దిగ్బంధంలో ఉండిపోయింది.

పవన్ రూ.కోటి విరాళం

ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని ఏరియాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి.

అష్ట దిగ్భంధనం ముగిసింది.. కరోనా కథ ముగియలేదు: మోదీ

కోవిడ్ మహమ్మారిని లైట్‌గా తీసుకోవద్దని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నేడు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణకు విరాళం ప్రకటించిన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సీఎంలు..

భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా దెబ్బతిన్న హైదరాబాద్‌ను ఆదుకునేందుకు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.