'సాహో'.... బాహుబలి2 తో ఫస్ట్ లుక్ టీజర్ ప్రదర్శన
Sunday, April 23, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సుమారు 5 సంవత్సరాలు.. ఒకే పాత్రలో ఓకే చిత్రంలో నటించి కేవలం భారతదేశలోనే కాదు ప్రపంచంలో నలుమూలలా వున్న భారతీయులందరికి ఇది మా చిత్రం అని మీసం మెలిపెట్టెలా.. ఇతనే మా భారతదేశ బాహుబలి అని వెలిగెత్తి చాటేలా కీర్తిప్రతిష్టలు సాధించిన రెబెల్‌స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ఇప్పటికి ఎప్పటికి భారతీయ సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులని పరిచయం చేసింది. బాహుబలి చిత్రం కోసం ఆయన చూపిన అంకితభావం, బాహుబలిగా ఆయన ప్రదర్శించిన నటన, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకోవటంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.
ఇదిలా ఉంటే అటు అభిమానులు, సినీ వర్గాలు.... ఇటు సాధారణ ప్రేక్షకులు, మీడియా వర్గాల్లో ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం టైటిల్ పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాల బాహుబలి తర్వాత వచ్చే చిత్రం కావడంతో అసలు ఏ టైటిల్ పెట్టారనే క్యూరియాసిటీతో ప్రపంచవ్యాప్త ప్రభాస్ అభిమానులు, భారతీయ సినీ ప్రేక్షకులు గూగుల్ లో సెర్చ్ చేయటం విశేషం.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... భారతీయ సినీ జగత్తు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రభాస్-సుజిత్-యువి క్రియేషన్స్ భారీ చిత్రానికి 'సాహో' అనే టైటిల్ ను ఖరారు చేశాం. ఈ హై టెక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందించబోతున్నాం. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగం కానున్నారు. మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో విదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను... అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్ లాంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం.
ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న సాహో చిత్ర ఫస్ట్ లుక్ అఫీషియల్ టీజర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న బాహుబలి 2 చిత్రంతో పాటు ప్రదర్శించనున్నాం. సో... ఏప్రిల్ 28వ తేది ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా అనే చెప్పాలి. సాహో స్టైలిష్ యాక్షన్ టీజర్ ను పెద్ద తెర పై చూసి ఆస్వాదించండి. అన్ని హంగులతో భారీ స్థాయిలో నిర్మితమవుతున్న సాహో` దేశవ్యాప్తంగా అభిమానులను అలరిస్తుంది అని ఆశిస్తున్నాం. అని అన్నారు.
వంశి-ప్రమెద్,విక్రమ్ సంయుక్తంగా యు.వి.క్రియోషన్స్ బ్యానర్ స్థాపించి యంగ్రెబల్స్టార్ ప్రభాస్ తో మిర్చి అనే చిత్రాన్ని నిర్మించారు. అప్పటికి రెబల్‌స్టార్ ప్రభాస్ కెరీర్ బెస్ట్ గ్రాస్ ని అందించారు. కొనసాగింపుగా యువి క్రియేషన్స్ నిర్మించిన ప్రతి చిత్రం ఆయా హీరోలకి బెస్ట్ గ్రాసర్ బ్లాక్‌బస్టర్స్ ని అందించింది. సినిమా పట్ల ప్యాషన్ తో స్టోరి జడ్జిమెంట్ తో 100 శాతం సక్సెస్ రేట్ సాధించి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ముందుకు దూసుకుపోతున్నారు. కథ ని బేస్ చేసుకుని బడ్జెట్ ని రిచ్ గా ప్రొడక్షన్ డిజైన్ చేస్తూ... చూసిన ఆడియన్ కి ఇది యు.వి వారి చిత్రం అనే బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియోషన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments