ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తా... సినిమా టికెట్ ధరలపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు సినీ ప్రముఖులు.. సీఎం జగన్ సహా మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు కూడా. ఇక గత నెలలో చిరంజీవి నేతృత్వంలో ప్రభాస్, మహేశ్, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి వంటి ప్రముఖులు తాడేపల్లిలో జగన్‌ను కలిశారు. ఈ భేటీ తర్వాత పది రోజుల్లోనే గుడ్ న్యూస్ వింటారని.. సినీ పరిశ్రమకు అనుకూలంగా జీవో వస్తుందని చిరు చెప్పారు.
కానీ రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ విషయం తేలకముందే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ రిలీజైన సంగతి తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్‌కానుండటంతో జీవోపై సినీ ప్రముఖులు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎప్పుడూ వివాదాలకు, వార్తలకు దూరంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై స్పందించారు. రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందే , ధరలపై ఏపీ ప్రభుత్వం జీవో ఇస్తే సంతోషిస్తానని ప్రభాస్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇకపోతే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘‘రాధేశ్యామ్’’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అనేక వాయిదాల అనంతరం మార్చి 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామని స్వయంగా ప్రభాస్ అనౌన్స్ చేశారు.
పీరియాడిక్ లవ్ స్టోరీగా ‘రాధే శ్యామ్’ సినిమాను రూపొందించారు. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ సినిమాను నిర్మించగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇందులో విక్రమాదిత్య అనే హస్త సాముద్రికా నిపుణుడి పాత్ర పోషించారు ప్రభాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com