సింగరేణిలో ప్రభాస్ ‘సలార్’ షూటింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ఆయన కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేశాడు ప్రభాస్. అందులో ముందుగా ‘రాధేశ్యామ్’ విడుదలకు సన్నద్ధమవుతోంది. దీని తర్వాత ప్రభాస్ సలార్ మూవీ కోసం రెడీ అవుతాడు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో విజయ్ కరగందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా చెన్నై సింగారం శ్రుతిహాసన్ నటిస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా ‘సలార్’ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం..ఈ చిత్రాన్ని తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించబోతున్నారట. అది కూడా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. పది రోజుల పాటు సింగరేణిలో చిత్రీకరించాల్సిన ‘సలార్’ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారని టాక్. ప్రభాస్ నాలుగు నెలల పాటు ‘సలార్’ కోసం డేట్స్‌ను కేటాయించాడట. మే చివరి నాటికంతా ‘సలార్’ షూటింగ్‌ను పూర్తి చేసేలా యూనిట్ ప్లాన్ చేసిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments