close
Choose your channels

Salaar :'సలార్' యూనిట్ షాకిచ్చిందిగా.. రిలీజ్ డేట్‌పై సంచలన ప్రకటన

Wednesday, September 13, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘సలార్’’. ఈ మూవీపై భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. సలార్ ఎప్పుడు విడుదల అవుతుందన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ సలార్ యూనిట్ నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొస్తోంది. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ అవుతుందంటూ అమెరికాలో బుకింగ్స్ కూడా మొదలెట్టేశారు. విడుదల కావడానికి నెల రోజుల ముందే సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇలాంటి పరిస్ధితుల్లో సలార్ రిలీజ్ వాయిదా పడిందంటూ గాసిప్స్ మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో సలార్ యూనిట్ మౌనం వీడింది. సెప్టెంబర్ 28న సలార్ రావడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పింది. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘సలార్ అనుకున్న టైంకి విడుదల చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం.. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. లాంగ్ వీకెండ్‌తో పాటు వరుస సెలవులు కలిసొచ్చిన మంచి టైంను సలార్ మిస్ చేసుకుందని బాధపడుతున్నారు. అయితే సలార్ విడుదల లేకపోవడంతో ఈ టైంని క్యాష్ చేసుకునేందుకు మిగిలిన చిత్రాలు పోటీ పడుతున్నాయి.

ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ సలార్ ను నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment