తొలి తెలుగు చిత్రంగా ప్రభాస్ `సాహో`
Send us your feedback to audioarticles@vaarta.com
ఆల్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆగస్ట్ 30న `సాహో`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. `బాహుబలి` తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం కావడంతో `సాహో`పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, చంకీపాండే, జాకీష్రాఫ్, మందిరాబేడి, మురళీశర్మ తదితరులు నటించారు. ప్రమోషన్స్‌లో యూనిట్ బిజీ బిజీగా ఉండింది. లేటెస్ట్‌గా ఈ సినిమాకు లైవ్ ఎమోజీని ట్విట్టర్ ఇచ్చింది. కబాలి, మెర్సల్, ఎన్.జి.కె చిత్రాల తర్వాత లైవ్ ఎమోజీతో ట్విట్టర్‌లో ప్రమోట్ అవుతున్న తొలి తెలుగు సినిమా `సాహో`యే కావడం విశేషం
భారీ ప్రీ రిలీజ్ బిజినెస్...ప్రమోషన్స్‌లో కొత్త ప్లానింగ్
అంచనాలలకు తగ్గట్లు నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. రూ.335కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి విడుదలకు ముందు ఎన్నో అంచనాలను, రికార్డులను క్రియేట్ చేస్తోన్న `సాహో` రిలీజ్ తర్వాత మరెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రమోషన్స్ కోసం ఏకంగా సాహో టీమ్ ఓ ప్రైవేట్ జెట్ ఫ్లైట్‌ని మాట్లాడుకుని అందులోనే దేశమంతా తిరిగేస్తుంది. ఇప్పటికే సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టిన యూనిట్ ప్రమోషన్స్ విషయంలో వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సంస్థ ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తుందని సినీ వర్గాల సమాచారం. ఈ సంస్థను ప్రమోషన్స్ కోసం భారీ మొత్తంతో `సాహో` టీమ్ నియమించుకుంది. ప్రస్తుతం వారి ప్లానింగ్‌లోనే `సాహో` ప్రమోషన్స్ జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments