'సాహో' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌...

  • IndiaGlitz, [Monday,October 23 2017]

యంగ్ రెబ‌ల్‌స్టార్ పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రం 'సాహో' ఫ‌స్ట్‌లుక్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. పెద్ద మ‌హాన‌గ‌రంలో చీక‌టిలో న‌డిచి వ‌స్తున్నట్ల ప్ర‌భాస్ లుక్ క‌న‌ప‌డుతుంది. ఈ లుక్‌లో ప్ర‌భాస్ ముఖానికి బ‌ట్ట క‌ట్టుకుని ఉండ‌టం విశేషం. ఈ సినిమా షూటింగ్ కంటే ముందే..టీజ‌ర్ విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సుజీత్ ద‌ర్శ‌కుడు. మ‌ది సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, శంక‌ర్ ఎహ్‌సాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌భాస్ బాహుబ‌లి త‌ర్వాత న‌టిస్తోన్న చిత్రం కావ‌డంతో అంద‌రూ సినిమా వైపు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

More News

మ‌హేష్ బాబు.. రెండు ఇంట్ర‌స్టింగ్‌ టైటిల్స్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం భ‌ర‌త్ అను నేను చిత్రంతో బిజీగా ఉన్నారు. శ్రీ‌మంతుడు త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న చేస్తున్న చిత్రమిది. కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు.

ఏప్రిల్‌లో పెద్ద సినిమాల సంద‌డి

2018 ఏప్రిల్.. తెలుగు సినిమా విష‌యంలో ఆస‌క్తిక‌రంగా మారింది. మూడు పెద్ద ప్రాజెక్టులు వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆర్డ‌ర్ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కింగ్‌ నాగార్జున‌, సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రాలు ఏప్రిల్‌లో విడుద‌ల అయ్యే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకుంటున్నాయి.

'తారామ‌ణి' టీజ‌ర్ విడుద‌ల‌

అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'తారామ‌ణి'. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నియశ్వంత్ మూవీస్ స‌మర్ప‌ణ‌లో డి.వి.సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వెంక‌టేష్ తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు.

నిఖిల్‌తో మ‌రో కొత్త హీరోయిన్‌

స్వామిరారా, కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా వంటి డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్స్‌తో స‌క్సెస్ సాధిస్తున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా ఓ కొత్త చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

'లాలిజో..లాలిజో' ట్రైలర్‌ ఆవిష్కరణ

సంభీత్‌, నేహారత్నాకరన్ హీరో హీరోయిన్లుగా జై శ్రీ సంతోషిమాత ప్రొడక్షన్‌ పతాకంపై మోహన్‌ శ్రీ వత్సస దర్శకత్వంలో షంఖు, కిరణ్‌లు నిర్మిస్తోన్న 'లాలిజో లాలిజో' చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.