సౌత్‌లో ప్రభాస్ రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ సెలబ్రిటీలను వారి అభిమానులకు దగ్గర ఉంచే మీడియాల్లో సోషల్ మీడియా చాలా కీలకభూమి పోషిస్తుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా తన విస్తతిని పెంచుకుంటూ పోతుంది. ఆడియెన్స్ కూడా సోషల్ మీడియాలోనే విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సినీ ప్రేక్షకుల విషయానికి వస్తే.. వారి అభిమాన హీరోలను సోషల్ మీడియాలను ఫాలో కావడానికి వారి విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అంతేనా! ఈ మధ్య ఫ్యాన్స్ వార్‌కు సోషల్ మీడియానే వేదికగా మారుతుంది. ఇక ఇలాంటి కరోనా టైమ్‌లో సోషల్ మీడియాలో స్టార్స్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య చాలానే పెరిగింది.
టాలీవుడ్ స్టార్స్ విషయానికి వస్తే సోషల్ మీడియాపై మన అగ్ర హీరోలెప్పుడూ ప్రత్యేకమైన దృష్టిని సారిస్తుంటారు. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయమొకటి తెలిసింది. అదేంటంటే ఫేస్‌బుక్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 14 మిలియన్ ఫాలోవర్స్‌తో సౌత్‌లోనే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న స్టార్‌గా నెంబర్‌వన్‌గా నిలిచాడు. ప్రభాస్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 13.1 మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. తర్వాత మహేశ్ 7.97 మిలియన్ ఫాలోవర్స్.. రామ్‌చరణ్ 7.1 మిలియన్ ఫాలోవర్స్.. 5.2 మిలియన్ ఫాలోవర్స్‌తో మన తెలుగు హీరోలు అభిమానులను సంపాదించుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments