ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఓటీటీ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘రాధేశ్యామ్’’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా తదితర కారణాల వల్ల ఆలస్యమైంది. దేశంలో పరిస్ధితులు చక్కబడటంతో మార్చి11న ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 వేలకు పైగా స్క్రీన్లలో గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ అయింది. కృష్ణంరాజు, అలనాటి అందాల తార భాగ్యశ్రీ కీలక పాత్రలు పోషించారు. సాహో తర్వాత మూడేళ్లకు ప్రభాస్ సినిమా విడుదల కానుండడంతో అడ్వాన్స్ బుకింగ్ బాగా జరిగింది. అయితే అభిమానుల అంచనాలను రాధేశ్యామ్ అందుకోలేకపోయింది. మిక్స్‌డ్ టాక్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇకపోతే రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ కోసం ఈ సెక్టార్‌లోని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 నుంచి రాధేశ్యామ్ స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం రాధేశ్యామ్ ఇప్పటి వరకు 212.76 కోట్ల కలెక్షన్లను సాధించింది.
రాధేశ్యామ్ విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని యూవీ క్రియేషన్స్‌తో అమెజాన్ డీల్ కుదిరించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోతుండటంతో.. ఒప్పందానికి పది రోజుల ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు యూవీ సంస్థతో అమెజాన్ మరో అగ్రిమెంట్ చేసుకుందని ఫిలింనగర్ టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments