ప్రభాస్ ఫ్యాన్స్‌కి చేదువార్త , సంక్రాంతి రేస్ నుంచి ‘‘రాధేశ్యామ్’’ ఔట్.. అఫిషీయల్ అనౌన్స్మెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఊహాగానాలే నిజమయ్యాయి.. సంక్రాంతి బరిలో నుంచి మరో పెద్ద సినిమా తప్పుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘‘రాధేశ్యామ్’’ విడుదల వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘రాధేశ్యామ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు గడిచిన కొన్నిరోజులుగా తాము తీవ్రంగా ప్రయత్నించాం. కానీ ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో వుంచుకుని రాధేశ్యామ్‌ను వాయిదా వేయక తప్పడం లేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి మీ ముందుకు వస్తాం’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
కాగా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల వాయిదా పడినప్పటి నుంచే... 'రాధే శ్యామ్' విడుదల విషయంలోనూ అనుమానాలు తలెత్తాయి. ఎందుకంటే... రెండూ పాన్ ఇండియా సినిమాలే. తెలుగు మార్కెట్‌తో పాటు, నేషనల్ మార్కెట్‌ను నమ్మకుని తీసిన సినిమాలు. ఢిల్లీలో థియేటర్లు క్లోజ్ చేయడం, మహారాష్ట్రలో సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే షోలు వేయడానికి అనుమతులు ఇవ్వడం, తమిళనాడులో 50 శాతం ఆక్యుపెన్సీకు అనుమతించడంతో 'ఆర్ఆర్ఆర్'ను తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు.
మరి రాధేశ్యామ్ పరిస్ధితి ఏంటని అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూశాయి. ఈ మూవీ పోస్ట్‌పోన్ అయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినా చిత్ర యూనిట్ వాటిని కొట్టిపారేసింది. జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తేల్చిచెప్పారు మేకర్స్. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో సినిమాను రిలీజ్ చేస్తే రికవరీ కష్టమని భావించిన మేకర్స్.. అందరి అభిప్రాయం తీసుకుని వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
పీరియాడిక్ లవ్ స్టోరీగా ‘రాధే శ్యామ్’ సినిమాను రూపొందించారు. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ సినిమాను నిర్మించగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇందులో విక్రమాదిత్య అనే హస్త సాముద్రికా నిపుణుడి పాత్ర పోషించారు ప్రభాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments