స్వీయ నిర్బంధంలో ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Friday,March 20 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌.. స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అందుకు కార‌ణ‌మేంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌రోనా వైర‌స్‌. విదేశాల్లో నుండి వ‌స్తున్న వారిపై క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. అందువ‌ల్ల ప్ర‌భుత్వాలు విదేశాల నుండి వ‌చ్చిన వారు బ‌య‌ట‌కు రాకండ‌ని, ఆరోగ్య జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి. ఆ క్ర‌మంలో రీసెంట్‌గా ప్ర‌భాస్ 20 సినిమా షూటింగ్ యూర‌ప్‌లోని జార్జియాలో జ‌రిగింది. ఈ షెడ్యూల్ షూటింగ్ ముగించుకుని ఇండియా వ‌చ్చిన ఎంటైర్ యూనిట్ స్వీయ నిర్బంధంలోకి ఉంటున్నారు. ఇప్ప‌టికే పూజా హెగ్డే, ప్రియ‌ద‌ర్శి త‌మ‌కు తాము స్వీయ నిర్బంధంలో ఉంటున్న‌ట్లు తెలిపారు. ఇప్పుడు ఈ లిస్టులో ప్ర‌భాస్ జాయిన్ అయ్యారు. అయితే ప్ర‌భాస్ తాను స్వీయ నిర్బంధంలో ఉంటున్న‌ట్లు చెప్ప‌లేదు. కానీ ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. ఎవ‌రినీ క‌ల‌వ‌డం లేద‌ట‌.

ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీ కృష్ణామూవీస్‌,యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతోన్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ మాత్రం క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాతే ఉంటుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిని ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.