'జాన్' కోసం రెడీ అవుతున్న ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
`బాహుబలి` సిరీస్‌తో ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగింది. లోకల్ స్టార్ కాస్త నేషనల్ స్టార్ అయిపోయాడు. అందుకే.. పాన్ - ఇండియా అప్పీల్ ఉండేలా కథలను ఎంచుకుంటున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. తాజాగా `సాహో`తో పలకరించిన ప్రభాస్.. ఇప్పుడు తన తదుపరి చిత్రం `జాన్` (వర్కింగ్ టైటిల్) కోసం సిద్ధమవుతున్నాడు. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరియాడికల్ లవ్ స్టోరీలో ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.
1970ల కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని సమాచారం. ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ కూడా జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించి... అక్టోబర్ నాలుగో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిసింది. అంతేకాదు.. నాలుగు నెలల్లో చకచకా చిత్రీకరణ జరిపి సినిమాని శరవేగంగా పూర్తిచేసే దిశగా యూనిట్ సన్నాహాలు చేస్తోందట. అలాగే వేసవి కానుకగా `జాన్`ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దిశగా పక్కా ప్లానింగ్ జరుగుతోందట.
మరి.. `వర్షం`, `డార్లింగ్` తరువాత చాన్నాళ్ళకి ప్రభాస్ చేస్తున్న ఈ ప్రేమకథ.. తన కెరీర్‌కి ఏ మేరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే 2020 వేసవి వరకు వేచిచూడాల్సిందే. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది.. `జాన్`కి స్వరకల్పన చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments