Salaar Teaser : పులి, సింహం డేంజరే.. కానీ జురాసిక్ పార్క్‌లో :  ప్రభాస్ విశ్వరూపం చూశారా, ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్సే

  • IndiaGlitz, [Thursday,July 06 2023]

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘సలార్’’. అప్పుడెప్పుడో ఈ మూవీ నుంచి పోస్టర్లు రిలీజ్ చేయడమే తప్పించి.. అంతకుమించి ఎలాంటి అప్‌డేట్‌లను మూవీ యూనిట్ ఇవ్వలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో వారికి సర్‌ప్రైజ్ ఇస్తూ ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం ఉద‌యం 5 గంట‌ల 12 నిమిషాల‌కు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. చెప్పిన టైమ్‌కి సలార్ టీజర్‌ను విడుదల చేశారు. చుట్టూ గన్స్ పట్టుకుని నిలబడ్డ గ్యాంగ్‌తో ‘‘ సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదం.. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకంటే ఆ పార్క్‌లో’’’ అంటూ టీను ఆనంద్ డైలాగ్ చెబుతుండగా ప్రభాస్ అదిరిపోయే ఎంట్రీ ఇస్తారు.

కేజీఎఫ్ తరహాలో ఎలివేషన్స్ :

సలార్ టీజర్‌లోనూ కేజీఎఫ్ తరహా ఎలివేషన్స్‌ని కొనసాగించాడు ప్రశాంత్. మోస్ట్ పవర్‌ఫుల్‌గా యాక్షన్ సీక్వెన్స్‌ వున్నట్లుగా టీజర్ చూస్తే అర్ధమవుతోంది. చివరిలో రక్తం నిండిన పిడికిలి బిగించి, ఉగ్రరూపంతో ప్రభాస్ విలన్ గ్యాంగ్‌ను చూస్తున్న సీన్ టీజర్‌కే హైలెట్ అని చెప్పవచ్చు. వెండితెరపై చాలా కాలం నుంచి ప్రభాస్ మాస్ ఎలివేషన్స్‌ను చూసి చాలా కాలం అయిన అభిమానులకు సలార్ టీజర్ మంచి కిక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. అయితే టీజర్‌ చివరిలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్‌ను మాస్ లుక్‌లో చూపించి హీరోకి తగ్గట్లుగా విలన్‌ క్యారెక్టర్ వుంటుందని ప్రశాంత్ హింట్ ఇచ్చారు.

రెండు పార్ట్‌లుగా సలార్ :

సలార్‌ను రెండు పార్ట్‌లుగా తీస్తున్నారని గతంలోనే వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ దీనిని ఎవరూ అఫిషీయల్‌గా కన్ఫర్మ్ చేయలేదు. ఈ విషయంపైనా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ రిలీజ్ చేసిన టీజర్‌లో సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ అని మెన్షన్ చేశారు. దీంతో ఈ సీస్ ఫైర్ అంటే ఏమిటి అన్న దానిపై అభిమానులు ఆరా తీస్తున్నారు. యుద్ధ సమయంలో ఎక్కువగా ఈ మాట వినిపిస్తూ వుంటుంది. కాల్పులు ఎక్కువగా జరిగే సమయంలో రెండు దేశాల సైన్యాలు శాంతి చర్చలను అనుమతించడమే సీస్ ఫైర్.

సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు సలార్ :

ఇకపోతే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సలార్ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ సలార్ ను నిర్మిస్తున్నారు.