రానాతో ఫోటో దిగిన ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా బాహుబలి. ఈ సినిమా గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రమిది. 1700కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి రికార్డులకు తెర తీసింది. ఈ సినిమాలో బాహుబలిగా ప్రభాస్ నటిస్తే, అతనికి సరిజోడైన ప్రతి నాయకకుడు భళ్లాల దేవుడిగా రానా నటించాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలుసుకున్నారు.
ఇంతకు వీరి కలయిక ఎందుకని అనుకుంటున్నారా..`నేనే రాజు నేనే మంత్రి` కోసం. ఈసినిమాలో రానా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అగుమెంటెడ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీలో ఎవరైనా రానా ఫోటో దగ్గర నిలబడి ఫోటో తీసుకుంటే, ఫోటోలో రానా పక్కనే నిలబడ్డట్లు ఫోటో ఉంటుంది. ఈ టెక్నాలజీని ప్రభాస్ నిన్న పరిశీలించాడు. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments