'రాధేశ్యామ్' వాలంటైన్స్ డే గ్లింప్స్ : ‘‘ఇంకా పెళ్ళెందుకు కాలేదు’’.. పూజ ప్రశ్నకు ఇబ్బందిపడ్డ ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సిన రాధేశ్యామ్.. దేశంలో కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఢిల్లీలో థియేటర్లు క్లోజ్ చేయడం, మహారాష్ట్రలో సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే షోలు వేయడానికి అనుమతులు ఇవ్వడం, తమిళనాడులో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతించడంతో రాధేశ్యామ్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. అయితే పరిస్ధితులు చక్కబడటంతో మార్చి 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తాజాగా వాలంటైన్స్ డేను పురస్కరించుకుని ‘‘రాధేశ్యామ్’’ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లలో ప్రభాస్-పూజల మధ్య లవ్ ట్రాక్‌ను హైలెట్ చేశారు. ‘‘మళ్ళీ లైఫ్ లో వాడి మొహం చూడను అనే పూజ వాయిస్‌తో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. కుక్ చేస్తావ్.. ఇంత బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు అని ప్రేరణ అడిగితే.. విక్రమాదిత్య ఇబ్బంది పడటం నవ్వు తెప్పిస్తుంది.
పీరియాడిక్ లవ్ స్టోరీగా ‘రాధే శ్యామ్’ సినిమాను రూపొందించారు. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ సినిమాను నిర్మించగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో విక్రమాదిత్య అనే హస్త సాముద్రికా నిపుణుడి పాత్ర పోషించారు ప్రభాస్. కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్య శ్రీ, మురళీ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments