డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: మార్చి 11న రాధేశ్యామ్.. స్వయంగా ప్రకటించిన ప్రభాస్

  • IndiaGlitz, [Wednesday,February 02 2022]

ఆర్ఆర్ఆర్‌ రిలీజ్ విషయంలో క్లారిటీ రావడంతో టాలీవుడ్‌లో పెద్ద కదలిక వచ్చింది. చిన్నా, పెద్దా సినిమాలు ఒకదాని వెంట మరొకటి కొత్త డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఇకపోతే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్‌తో పాటే రిలీజ్ కావాల్సిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘‘రాధేశ్యామ్’’ సైతం విడుదల తేదీపై స్పష్టమైన ప్రకటన చేసింది. మార్చి 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రభాస్ బుధవారం స్వయంగా వెల్లడించారు. ‘‘విధిరాతకు, ప్రేమకు మధ్య జరగబోయే భారీ యుద్ధాన్ని మార్చి 11న థియేటర్లలో చూడండి... ఆ రోజు థియేటర్లలో కలుద్దాం అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సిన రాధేశ్యామ్.. దేశంలో కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఢిల్లీలో థియేటర్లు క్లోజ్ చేయడం, మహారాష్ట్రలో సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే షోలు వేయడానికి అనుమతులు ఇవ్వడం, తమిళనాడులో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతించడంతో రాధేశ్యామ్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది.

పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా ‘రాధే శ్యామ్’ సినిమాను రూపొందించారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ సినిమాను నిర్మించగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇందులో విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర పోషించారు ప్ర‌భాస్.

More News

చివరి షెడ్యూల్‌ జరుపుకుంటున్న జీ5 'గాలివాన' వెబ్‌ సిరీస్‌

‘జీ 5’... ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల

'పంచతంత్రం'లో కథా బ్రహ్మ బ్రహ్మానందం క్యారెక్టర్ టీజర్ విడుదల

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'పంచతంత్రం'.

చీప్ యాక్టర్‌‌తో పోల్చొద్దంటూ పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి

సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజన్లకు టార్గెట్‌గా మారుతున్నారు సెలబ్రిటీలు. చిన్న పోస్ట్ చేయడం పాపం.. అయినదానికి కానిదానికి వాళ్లను ట్రోల్ చేస్తున్నారు.

క్రిప్టో కరెన్సీకి కళ్లెం.. ఇండియాలో అందుబాటులోకి డిజిటల్ రూపీ

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పెట్టుబడులు పెట్టేవారు కూడా రోజురోజుకు విస్తరిస్తున్నారు. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి కూడా వచ్చింది.

వేతన జీవులకు నిరాశ... ట్యాక్స్ స్లాబులపై నోరు విప్పని నిర్మలా సీతారామన్

2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పేయర్స్‌కు నిర్మలమ్మ నిరాశనే మిగిల్చారు.