ఆఫీషియల్: స్టైలిష్ పోస్టర్ తో రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర రిలీజ్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: పోసానికి కరోనా.. దర్శక, నిర్మాతలు నన్ను క్షమించాలి అంటూ..
ఎట్టకేలకు ఆ శుభవార్త వచ్చేసింది. స్వయంగా ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా సూపర్ స్టైలిష్ గా ఉండే పోస్టర్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. 'మీరంతా నా రొమాంటిక్ సాగా 'రాధే శ్యామ్' చిత్రం చూసే క్షణం కోసం ఎదురుచూడలేకున్నా. రాధేశ్యామ్ మూవీ జనవరి 14, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది' ని ప్రభాస్ ప్రకటించాడు. అంటే ఈ సంక్రాంతి కానుకగా రాధే శ్యామ్ రిలీజ్ కానుంది.
ఇక పోస్టర్ విషయానికి వస్తే ప్రభాస్ చుట్టూ యూరప్ కు చెందిన భవంతులు కనిపిస్తున్నాయి. స్టైలిష్ సూట్ ధరించిన ప్రభాస్ చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని వస్తున్న స్టైల్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది.
చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ చిత్రం. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హేగే మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ప్రేమ, భావోద్వేగాలతో నడిపిస్తూనే పునర్జన్మ అనే కాన్సెప్ట్ కూడా టచ్ చేసినట్లు వినికిడి. ఈ మూవీలో ప్రభాస్ యూరప్ కు చెందిన వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపిస్తాడట.
యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతడి నుంచి వస్తున్న ప్రతి చిత్రం పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతోంది. రాధే శ్యామ్ తర్వాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె లాంటి చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com