మొత్తానికి ప్రభాస్ 'రాధే శ్యామ్' పూర్తయింది.. కిక్కెక్కించే అప్డేట్ త్వరలో..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులని ఖుషి చేసే అప్డేట్ వచ్చింది. ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. చాలా రోజులగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
ఇదీ చదవండి: పూరి, దేవరకొండ 'లైగర్' అంచనాలు పెంచేసిన హీరోయిన్ తండ్రి
కరోనా పరిస్థితుల వల్ల షూటింగ్ కి అంతరాయం ఏర్పడడంతో మరింత ఆలస్యం జరిగింది. కానీ ఎట్టకేలకు షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు రాధాకృష్ణ సోషల్ మీడియాలో ప్రకటించాడు. మరో మూడు రోజుల్లో రాధేశ్యామ్ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ రానున్నట్లు ప్రకటించాడు.
రాధేశ్యామ్ చిత్రం ఎమోషనల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. అయితే ఇది రెగ్యులర్ ప్రేమ కథ కాదు. ఈ చిత్ర కథ పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం పీరియాడిక్ నేపథ్యంలో 1960 కాలం నాటి పరిస్థితుల్లో జరుగుతుంది.
ప్రభాస్ ఈ చిత్రంలో ఇటలీకి చెందిన కార్ల వ్యాపారిగా కనిపిస్తాడట. ఈ చిత్రంలో పునర్జన్మ కథ కూడా ఉన్నట్లు వినికిడి. అందుకే ఈ చిత్రానికి బడ్జెట్ భారీగా ఖర్చయినట్లు తెలుస్తోంది. ఈ కాంప్లికేటెడ్ కథని దర్శకుడు ఎలా డీల్ చేసాడో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్ళబోతున్నట్లు టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments