ప్రభాస్, పూజా హెగ్డే మూవీ అప్‌డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. యువ దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్న 'సాహో' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఏప్రిల్ 12 నుంచి ప్రభాస్ అండ్ టీమ్ అబుధాబిలో చిత్రీకరించబోయే యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనబోతోంది.ఈ మూవీలో ఈ యాక్షన్ సన్నివేశాలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాణ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్‌లో 20వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం జూలై 7 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపు యూరప్‌లో చిత్రీకరణ జరుపుకోబోయే ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందనుంది. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను అధికారికంగా వెల్లడిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com