క‌రోనా ఎఫెక్ట్‌...ప్ర‌భాస్ 20 జార్జియా షెడ్యూల్ గురించి ఒక్కో ర‌క‌మైన వార్త‌

  • IndiaGlitz, [Tuesday,March 17 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ఓ డియ‌ర్‌, రాధేశ్యామ్ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా.. చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం జార్జియాలో చిత్రీక‌రణ‌ను జ‌రుపుకున్న షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ రాధాకృష్ణ క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. ఆయ‌న త‌న ట్వీట్ట‌ర్ ద్వారా ‘‘జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేశాం. జార్జియ‌న్ టీమ్ స‌హకారంతో షెడ్యూల్‌ను పూర్తి చేశాం. వారికి థాంక్స్‌. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తాం’’ అంటూ డైరెక్ట‌ర్ ట్వీట్ చేశారు రాధాకృష్ణ‌.

కానీ క‌రోనా ప్ర‌భావం షెడ్యూల్ మ‌ధ్య‌లోనే....

ప్రభాస్ 20 జార్జియా షెడ్యూల్ క‌రోనా ఎఫెక్ట్ ఉన్న‌ప్పుడే స్టార్ట్ అయ్యింది. నిజానికి ఈ నెల 30 వ‌ర‌కు షెడ్యూల్‌ను చిత్రీక‌రించాల‌నుకున్నారు. కానీ.. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ప్ర‌భాస్ 20 ఆగిపోయింద‌ని.. స‌ద‌రు షెడ్యూల్‌ను ఎలాగో మెనేజ్ చేయాల‌ని యూనిట్ భావిస్తుంద‌ట‌. అందుక‌నే యూనిట్ జార్జియా నుండి తిరిగి వ‌చ్చేస్తుంద‌ట‌. కానీ.. ఆ విష‌యాల‌ను చెప్ప‌కుండా షెడ్యూల్ పూర్త‌య్యిందంటున్నార‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

ప్ర‌భాస్‌, రాధేశ్యామ్ జంట‌గా న‌టిస్తోన్న ఈ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరినీ ఈ ఏడాది ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.

More News

దిశ నిందితుల్లాగే.. నిర్భయ నిందితులను కాల్చేయండి: బీజేపీ నేత

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’కు పాల్పడిన నిందితులను హైదరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

కరోనాపై ‘RRR’ హీరోల యుద్ధం.. ఈ ఆరు సూత్రాలు చాలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలోని

నిర్మలమ్మకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ థ్యాంక్స్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం కలిసింది.

నితిన్‌కి నో చెప్పిన నాని హీరోయిన్‌!!

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు.

కరోనా ఎఫెక్ట్.. పొరుగు రాష్ట్రంలో అన్నీ బంద్

‘కరోనా’ నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాల కీలక నిర్ణయం తీసుకున్నాయి.