‘స్పిరిట్' లో ప్రభాస్ రోల్ ఇదే.. అదే నిజమైతే అభిమానులకు పూనకాలే
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సిరీస్ కోసం దాదాపు ఐదేళ్ల పాటు అభిమానుల దూరమైన ప్రభాస్.. ఆ తర్వాతి నుంచి సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఆయన నటించిన 'రాధేశ్యామ్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగశ్విన్ తో కలిసి 'ప్రాజెక్ట్ కె' వంటి సినిమాలు పట్టాలెక్కించారు. వీటితో పాటు 'అర్జున్ రెడ్డి' ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రభాస్ ప్రకటించారు.
దీనికి 'స్పిరిట్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 'ఆదిపురుష్' సినిమాను నిర్మిస్తోన్న బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమారే దీనికి కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా 'స్పిరిట్' మొదలుకానుంది. ఈ మూవీని హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కించనున్నారు. అయితే ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటీ..? అసలు కథ ఎలా వుంటుంది ..? అని డార్లింగ్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పాత్ర ఎలా వుండబోతుందనే దానిపై నిర్మాత భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం.. 'స్పిరిట్'లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారట. అంటే కెరీర్లో తొలిసారి ప్రభాస్ పోలీస్ గెటప్ అలరించనున్నారన్న మాట. ఈ లుక్‌లో ఆయనను చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుతున్నారు. వాళ్ల ఆశలు ఫలించి ఇన్నాళ్లకు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు ప్రభాస్. ఈ న్యూస్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు మేకర్స్. అర్జున్ రెడ్డితో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌ను ఎలా ప్రజంట్ చేస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వచ్చే ఏడాదిలో ‘‘స్పిరిట్’’ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం వంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి 'యానిమల్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ప్రభాస్ సినిమా పట్టాలెక్కే అవకాశం వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com