‘ఆదిపురుష్’ గురించి ప్రభాస్ ప్లాన్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా క్రేజీ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ ఓంరావుత్ దర్శకత్వంలో పౌరాణికం రామాయణంను ‘ఆదిపురుష్’ పేరుతో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో రోజుకొక వార్త వినిపిస్తుంది. సీతగా ఎవరు నటిస్తారు? రావణుడుగా సైఫ్ అలీఖాన్ నటిస్తారా? అనే విషయాలపై వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. రాముడు పాత్రలో నటించే ప్రభాస్ ఇప్పటి నుండే ‘ఆదిపురుష్’ కోసం కసరత్తులు చేయడానికి రెడీ అవుతున్నారట. ముఖ్యంగా విలువిద్యపై ఫోకస్ పెడుతున్నారట ప్రభాస్.
విలువిద్య నేర్చుకోవడం ప్రభాస్‌కు కొత్తేమీ కాదు.. బాహుబలి నుండి ప్రభాస్ ఆర్చరీ నేర్చుకుంటూనే ఉన్నారు. అంతకు ముందే.. బిల్లా సినిమా కోసం కూడా ప్రభాస్ ఆర్చరీ నేర్చుకున్నారు. కానీ బాహుబలి కోసం పూర్తిస్థాయిలో విలువిద్యను ఆర్చరీ నేర్చుకున్నారు. ఇప్పుడు ఆర్చరీ నేర్చుకునే అవకాశం ఆదిపురుష్‌తో వస్తుంది. బాహుబలి సినిమా కోసం తన ఫామ్ హౌస్‌లో ఆర్చరీ సంబంధిత కిట్‌ను తెప్పించుకుని ప్రాక్టీస్ చేశారట ప్రభాస్. ‘ఆదిపురుష్’ కోసం తన ఫామ్‌హౌస్‌లోని ఆర్చరీ కిట్‌ను ఇంటికి తెప్పించుకుని ప్రాక్టీస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారట ప్రభాస్. రాధేశ్యామ్ పూర్తి కాగానే.. ప్రభాస్ తన 21వ సినిమాగా నాగ్ అశ్విన్ స్టార్ట్ చేస్తారా? ‘ఆదిపురుష్’ను స్టార్ట్ చేస్తారా అని ఆలోచనలో కూడా ప్రభాస్ ఉన్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments