మళ్లీ అక్కడకు ప్లాన్ చేస్తున్న ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ తాజా చిత్రం `జాన్`(వినపడుతున్న పేరు) చిత్రీకరణ దశలో ఉంది. రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే నెక్ట్స్ షెడ్యూల్‌కు ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. వెంటనే స్టార్ట్ చేసేస్తున్నాడట. ఇండస్ట్రీలో వినపడుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 7న స్టార్ట్ చేయబోతున్నాడట. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ షెడ్యూల్లో ఆస్ట్రియాలో షూట్ చేయబోతున్నారట. యూరప్‌కు వెళ్లకూడదనే భారీ సెట్స్ వేసి ఈ చిత్రాన్ని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ మళ్లీ యూరప్ ఎందుకు వెళ్లడమనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందనుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాదినే విడుదల కాబోతున్నట్లు సమాచారం. అలాగే సీనియర్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఇందులో ప్రభాస్ అమ్మ పాత్రలో నటిస్తున్నారు. జిల్ పేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈచిత్రాన్ని యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణా మూవీస్ నిర్మిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments