జపాన్‌లో ప్రభాస్ క్రేజ్.. IKEA బాటిల్స్‌పై ‘‘రాధేశ్యామ్’’ స్టిక్కర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సీరిస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్‌గా వున్న ప్రభాస్ కాస్తా.. పాన్ ఇండియా స్థార్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిల్లోనూ బాహుబలికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి వసూలైన కలెక్షన్లను బట్టే ఆ విషయం తెలుసుకోవచ్చు. జపాన్, చైనా, రష్యా తదితర దేశాల్లోనూ ప్రభాస్‌కు అభిమానులు వున్నారు.
ముఖ్యంగా జపాన్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ భారతీయ సినిమాలకు మంచి క్రేజ్ వుంది. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఇప్పుడు జపనీయుల ఫేవరేట్ హీరోల లిస్టులో ప్రభాస్ కూడా చేరిపోయారు. అప్పట్లో జపనీస్ అభిమానులు ప్రభాస్ ‘బాహుబలి’ ఆర్ట్ మెటీరియల్స్ తో పాటు మిగతా వాటిని కూడా తయారు చేసేవారు. తరువాత వారు దానిని బాహుబలి టీమ్‌తో పంచుకునేవారు.
తాజాగా జపాన్‌కు చెందిన కూల్‌డ్రింక్ బాటిల్స్ క్రేట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సీసాల లేబుల్స్‌పై ప్రభాస్ ఫోటోలు ఉండటం విశేషం. నిజానికి అవి జపాన్ IKEAలో అమ్ముడవుతున్న ఖాళీ గాజు సీసాలు. వాటికి ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ట్రైలర్ లుక్ స్టిక్కర్స్ వుండటం విశేషం. అయితే ఈ పనిని ప్రభాస్ పర్మిషన్‌తో చేశారో లేక అభిమానంతో చేశారో తెలియదు కానీ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమా విషయాలకి వస్తే.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘‘రాధేశ్యామ్’’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లో సందడి చేయనుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధలు నిర్మిస్తున్నారు. దీనితో పాటు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘ప్రాజెక్ట్ కే’’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌ను ఇటీవలే స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకోణే హీరోయిన్‌గా నటిస్తుండగా... బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు `సలార్`, `ఆదిపురుష్` చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments