యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దందా..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ తో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా గోపీక్రిష్ణా బ్యానర్ పై క్రిష్ణంరాజు దందా అనే టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిష్టర్ చేయించారు. ఈ టైటిల్ ప్రభాస్ కోసమే రిజిష్టర్ చేయించి ఉంటారనే ప్రచారం జరుగుతుంది. గతంలో క్రిష్ణంరాజు ప్రభాస్ తో ఒక్క అడుగు అనే టైటిల్ తో మూవీ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. మరి...బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ డైరెక్టర్ తో మూవీ చేస్తారా..? లేక గోపీక్రిష్ణా బ్యానర్ లో దందా చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments