ప్రభాస్ నెక్ట్స్ మూవీ గురించి క్లారిటీ వచ్చేసింది..
Tuesday, August 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 చిత్రంలో నటిస్తున్నారు. దర్శకధీర రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి 2 ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే..ఈ చిత్రం తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే...గత రెండు రోజులు నుంచి ప్రభాస్ బాహుబలి 2 తర్వాత గోపీచంద్ తో జిల్ చిత్రాన్ని తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని...ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ సుజిత్ తో సినిమా చేయనున్నాడా..? జిల్ ఫేమ్ రాధాకృష్ణ తో సినిమా చేయనున్నాడా అనేది ఆసక్తిగా మారింది. అయితే...యు.వి. క్రియేషన్స్ సంస్థ సమాచారం ప్రకారం ప్రబాస్ తదుపరి చిత్రాన్ని సుజిత్ తో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో ప్రారంభించి జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments