రూ.120 కోట్ల‌తో ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌?

  • IndiaGlitz, [Thursday,April 05 2018]

‘బాహుబలి’ సిరీస్ తర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ పేరు.. టాలీవుడ్‌తో పాటు అన్ని ఫిలిమ్‌ ఇండస్ట్రీలలో మరుమోగిపోతోంది. దేశమంతా అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోతో ఎంతటి భారీ బడ్జెట్ సినిమాలైనా చేయడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. మార్కెట్ పరంగా ప్రభాస్‌కు ఎటువంటి ఢోకా లేదు. దేశమంతా సినిమాని విడుదల చేసుకునే వెసులుబాటు ఉండడంతో.. బడ్జెట్ గురించి నిర్మాతలు కూడా అస్స‌లు పట్టించుకోవడం లేదు. కాని కథల విషయంలో, సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు

యంగ్ రెబల్ స్టార్. ఇప్పటికే.. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. యు.వి క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ కృష్ణ  నిర్మిస్తున్న ఈ త్రిభాషా చిత్రం దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. అలాగే.. ‘జిల్’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్రభాస్ హోమ్ బ్యాన‌రైన గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.120 కోట్లను వెచ్చించనున్నారని సమాచారం. టాప్ టెక్నీషియ‌న్స్‌తో సినిమాని పూర్తిగా ఓవర్సీస్‌లోనే చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సినిమాని విడుదల చేసుకోవచ్చనే ధైర్యంతో.. బడ్జెట్ విషయంలో ముందడుగు వేస్తున్నారని తెలుస్తోంది.