ప్రభాస్ కొత్త సినిమా ఎప్పుడో తెలుసా..
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలితో నేషనల్ స్టార్ అయిన యంగ్ రెబల్ స్టార్ట్ ప్రభాస్ ఇప్పుడు `సాహో` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాని యు.వి.క్రియేషన్స్ సంస్థ ప్లాన్ చేస్తుంది. ప్రభాస్ మేజర్ పార్ట్ పూర్తి కాగానే, ఫిబ్రవరిలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, ప్రస్తుతం సాహో సినిమాను నిర్మిస్తోన్న యు.వి.క్రియేషన్స్ బేనర్ ఈ కొత్త సినిమాను నిర్మించనుందట. పీరియాడికల్ సోషియో ఫాంటసీ కథాంశంతో సినిమా తెరకెక్కనుండని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ చేయి చూసి జ్యోతిష్యం చెప్పే పాత్రలో కనపడతాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments