Project K : పెద్ద చేయి, గన్స్ పట్టుకున్న వ్యక్తులు.. ప్రభాస్ ‘‘ప్రాజెక్ట్ కే ’’ కొత్త పోస్టర్ వైరల్, రిలీజ్ ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అర్జెంట్‌గా ఓ హిట్టు కావాలి. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు పరిశ్రమను తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ నెక్ట్స్ సినిమాలు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కేలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని డార్లింగ్ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసింది ‘‘ప్రాజెక్ట్ కే ’’ చిత్ర యూనిట్. ఈ మేరకు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2024 , జనవరి 12న ప్రాజెక్ట్‌ను విడుదల చేయనున్నారు. అయితే ఈ విషయాన్ని చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్ గూస్బంప్స్ తెప్పించేలా వుంది. అందులో ఓ ఏడారి లాంటి ప్రదేశంలో పెద్ద చెయ్యి.. దాని ముందు తుపాకులు పట్టుకున్న ముగ్గురు వ్యక్తుల్ని చూపించారు. వారి చుట్టూ పలు యంత్రాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈ పోస్టర్ ఎన్నో ప్రశ్నలకు కారణమవుతోంది.
తెలుగు తెరపై గతంలో కనిపించని విధంగా ప్రాజెక్ట్ కే:
ఇకపోతే.. ప్రాజెక్ట్‌కే ను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వీనిదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, దీపీకా పదుకొనే, దిశా పటానీ తదితర స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించని కొత్త కథతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రాజెక్ట్‌ను రెండు పార్ట్‌లుగా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు సలార్, ఆదిపురుష్:
ఇదిలావుండగా.. ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. అయితే అంతకంటే ముందు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ప్రాజెక్ట్ కే వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com