అంచనాలకు భిన్నంగా ప్రభాస్

  • IndiaGlitz, [Monday,March 16 2020]

బాహుబలితో నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌..సాహోతో ఓకే అనిపించుకున్నాడు. అయితే బాహుబ‌లితో వ‌చ్చిన క్రేజ్‌ను ఇప్పుడు రాధాకృష్ణ‌తో చేస్తున్న సినిమా ద్వారా క‌వ‌ర్ చేసుకోవాల‌ని అనుకుంటున్నాడు. అందుకు త‌గిన‌ట్లుగా సినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీగానే తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలుగా ఉండ‌టం కూడా ప్ర‌భాస్ అండ్ టీమ్‌కు క‌లిసొస్తుంది. అయితే దీని త‌ర్వాత మ‌హాన‌టి వంటి సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌తో సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌శాస్‌.

ఈ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి ఈ సినిమా గురించి ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అందుకు త‌గిన‌ట్లు నాగ్ అశ్విన్ కూడా సినిమా అంద‌రూ ఊహించిన దాని కంటే ఓ మెట్టు పైనే ఉంటుంద‌ని అనుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క‌త్రినా కైఫ్‌, దీపికా ప‌దుకొనే పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. అయితే ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ మాత్రం అందుకు భిన్నంగా వెళ్లాల‌నుకుంటున్నార‌ట‌. స‌మాచారం మేర‌కు ఓ కొత్త హీరోయిన్‌ను ఈ సినిమాలో తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు టాక్. ట్రావెల్ మిష‌న్ త‌ర‌హా క‌థ‌తో వ‌చ్చిన ఆదిత్య 369 స్టైల్లోనే ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని అంటున్నారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో సినిమాను షూటింగ్‌ను స్టార్ట్ చేసి వ‌చ్చేఏడాది చివ‌ర‌లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకున్నార‌ట‌.

More News

మళ్లీ ఢిల్లీకి పవన్.. ఏపీలో హాట్ టాపిక్

దాడులు, బెదిరింపులతో అప్రజాస్వామికంగా జరిగిన స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియను రద్దు చేసి, ఎన్నికల ప్రక్రియను తాజాగా చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్

కరోనా కాదు.. ఏదొచ్చినా పెళ్లి చేసుకుంటా!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లివిని పెళ్లాడబోతున్నాడు. అయితే ప్రపంచాన్ని కరోనా మహామ్మరి వణికిస్తున్న నేపథ్యంలో

‘అల వైకుంఠపురములో..’ డెలిటెడ్ సీన్.. ‘అర్జున్ రెడ్డి-2’!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

విదేశాల నుంచి వచ్చినవారికి జగన్ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ కరోనాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులే..: ఈటల

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..