బాలీవుడ్ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చిత్రం చేయనున్న ప్రభాస్..!
Send us your feedback to audioarticles@vaarta.com
‘సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కటే సినిమాకు కట్టుబడి ఉండాలనే నియమానికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టున్నాడు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. మరోవైపు ‘బాహుబలి’ తర్వాత ఎక్కువగా పాన్ ఇండియా మూవీస్ పైనే దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. రాధే శ్యామ్ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆదిపురుష్, సలార్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఆదిపురుష్, సలార్ చిత్రాలు 2022ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ మరో చిత్రానికి కూడా సైన్ చేశాడు.
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త చిత్రం ఈ వేసవిలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీని సైంటిఫిక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించనున్నారు. వీటన్నింటి నడుమ మరో ఆసక్తికర వార్త కూడా చిత్ర సీమలో వైరల్ అవుతోంది. అదేంటంటే ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఓ మల్టిస్టారర్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హృతిక్‌తో పాటు మరో హీరోగా ప్రభాస్ అయితే బాగుంటుందన్న ఆలోచనకు మేకర్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
వార్, బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్ద్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అనే టాక్ నడుస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలు రావడం చాలా అరుదని తెలుస్తోంది. అందునా బాలీవుడ్‌కి అయితే ప్రభాస్ కొత్త అనే చెప్పాలి. అలాంటిది బీటౌన్ ఆడియన్స్ మన ప్రభాస్‌ను ఏమేరకు ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఇప్పుడు ప్రభాస్, హృతిక్ సినిమాకు బీటౌన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com