ఆస‌క్తిరేపుతున్న ప్ర‌భాస్ టైటిల్‌....

  • IndiaGlitz, [Monday,October 08 2018]

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో సుజీత్ ద‌ర్శకత్వంలో చేస్తున్న 'సాహో' ఒక‌టి. కాగా మ‌రోటి 'జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా. రీసెంట్‌గా ఇటలీలో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం అయ్యింది. ఎక్కువ భాగం యూర‌ప్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనున్న ఈ సినిమా కోసం సెట్స్ కూడా రెడీ చేస్తున్నార‌ట‌.

ఈ సినిమాకు అమూర్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. అమూర్ అంటే ఫ్రెంచ్ భాష‌లో ప్రేమ అనే అర్థం వ‌స్తుంద‌ట‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ల‌వ్‌, ఫాంటసీ, థ్రిల్ల‌ర్ నేప‌థ్యాల్లో సినిమా రూపొంద‌నుంది.

'సాహో' చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయాల‌ని యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది. ఈ చిత్రంలో శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.