ప్ర‌భాస్ ప్రేయ‌సికి డెంగ్యూ|

  • IndiaGlitz, [Friday,October 05 2018]

శ్ర‌ద్ధా క‌పూర్‌ని శ్ర‌ద్ధా క‌పూర్ అని అన‌డం క‌న్నా 'సాహో'లో ప్ర‌భాస్ ప్రేయ‌సి అనో, లేకుంటే వెండితెర‌మీద సైనా నెహ్వాల్ అనో అంటే అంద‌రూ త్వ‌ర‌గా గుర్తుప‌డ‌తారేమో. తెలుగు వాళ్ల‌కు అలా ప‌రిచ‌య‌మైందీ భామ‌. హిందీలో ప‌లు సినిమాల్లో మెరిసిన శ్ర‌ద్ధాకు తెలుగులో మాత్రం ప్ర‌భాస్ తో న‌టిస్తున్న 'సాహో' తొలి సినిమా.

ఈ సినిమాలో ఒక్క చిన్న షెడ్యూల్ త‌ప్ప శ్ర‌ద్ధా పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. దాంతో ఈ భామ మొత్తం సైనా నెహ్వాల్ బ‌యోపిక్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తోంది. వ‌రుస‌గా షెడ్యూల్స్, ప్రాక్టీస్‌. వీటి వ‌ల్ల శ్ర‌ద్ధ అల‌సిపోయింది.

దానికి తోడు ఈ భామ‌కు డెంగ్యూ ఫీవ‌ర్ అటాక్ అయింది. ప్ర‌స్తుతం శ్ర‌ద్ధ రెస్ట్ తీసుకుంటోంది. ఆమెకు త్వ‌ర‌గా న‌యం కావాల‌ని నెటిజ‌న్లు గెట్ వెల్ సూన్ అంటూ పోస్ట్ చేస్తున్నారు.