‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశాడు. ‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు ఈ సినిమాను నిర్మించారు. కృష్ణుడు తన కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ అని ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ నిర్మించారు. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభినందనలు తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ సినిమా అందరికీ నచ్చేలా కంప్లీట్ లవ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందించామన్నారు. ఫైనల్ అవుట్ పుట్ చూశాక సంతృప్తిగా అనిపించిందన్నారు. తెలుగు ప్రేక్షకులు నటుడిగా తననెంతో ఆదించారని... ప్రస్తుతం నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నానని తెలిపారు. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామని కృష్ణుడు తెలిపారు. ఈ సినిమా ద్వారా కృష్ణుడు.. లోతుగడ్డ జయరామ్‌ను దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com