ప్రభాస్ చేతుల మీదుగా 'అరకు రోడ్ లో' సాంగ్ టీజర్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,August 24 2016]

రామ్‌ శంకర్‌, నిఖిషా పటేల్‌ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్‌ పతాకంపై వాసుదేవ్‌ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'అరకురోడ్‌లో'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్ర సాంగ్‌ టీజర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ.. 'ఎప్పుడురా పెళ్లి..' అనే ఈ సాంగ్‌ నా గురించే రాసినట్లుంది. లిరిక్స్‌ చాలా క్యాచీగా ఉన్నాయి. సాంగ్‌ చాలా వెరైటీగా ఉంది. సహజంగా పూరీ గారు తన సినిమాలలో ట్యూన్స్‌, లిరిక్స్‌ ఆయనే రాస్తుంటారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ కూడా మల్టీ టాలెంటెడ్‌లా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్‌ అదిరిపోయింది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.

చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ మాట్లాడుతూ.. 'గెడ్డం తెల్లబడి పోతావుందే..' అనే లిరిక్‌తో సాగే సాంగ్‌ టీజర్‌ను మా కోరిక మేరకు బాహుబలి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గారు ఫిల్మ్‌ సిటీలోని బాహుబలి సెట్‌లో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా టీమ్‌ అందరి తరుపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పాటని నేను, రామాంజనేయులు కలిసి రాయడం జరిగింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ మొత్తం పూర్తయింది. సెప్టెంబర్‌ 10న సినీ ప్రముఖుల సమక్షంలో హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో ఆవిష్కరణ జరుపనున్నాం. పూరీ సంగీత్‌ ద్వారా పాటలు మార్కెట్‌లోకి విడుదలకానున్నాయి...అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రామ్‌శంకర్‌, నిర్మాత మేకా బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

More News

రామోజీరావు చేతుల మీదుగా 'మనలో ఒకడు' టీజర్ విడుదల

ఆర్పీ పట్నాయక్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'మనలో ఒకడు' టీజర్ ను బుధవారం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘల్ రామోజీరావు విడుదల చేశారు.

గుడ్ ఆర్టిస్ట్ అనిపించుకోవాలి అంతే...వాటి గురించి ఆలోచించను - తారకరత్న

నందమూరి తారకరత్న,పంచి బొర,అనూప్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా వెంకటరమణ సాల్వ తెరకెక్కించిన హర్రర్ థ్రిల్లర్ ఎవరు.

దసరాకు ధృవ రావడం ఖాయం..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ.ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

'బంతిపూల జానకి' భలేఎంటర్ టైన్ చేస్తుంది .. చిత్ర బృందం

రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ‘బంతిపూల జానకి’అన్ని వర్గాల పక్షకులను చక్కగా ఎంటర్ టైన్ చేస్తుందని

చైతన్య ప్రేమమ్ వీడియో సాంగ్ ఆగస్టు 29న - ఆడియో సెప్టెంబర్ 20న విడుదల

చైతన్య అక్కినేని,శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో,చందు మొండేటి దర్శకత్వంలో