Kalki:రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి' స్ట్రీమింగ్.. వామ్మో అన్ని కోట్లా..?
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2898AD(Kalki)’. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మేకర్స్ వేగవంతం చేశారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్స్ ఫిక్స్ అయ్యాయి.
'కల్కి 2989 ఏడీ' హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్‌ను రూ.200 కోట్లకు, సౌత్ వెర్షన్‌ను రూ.175కోట్లకు ఆయా ఓటీటీలు కొనుగోలు చేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మూవీ విడుదలకు ముందే రికార్డులు సృష్టి్స్తుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ప్రభాస్ పక్కన ఉండే బుజ్జి క్యారెక్టర్‌ని పరిచయం చేశారు. ముఖ్యంగా అందులో బుజ్జి(రోబోట్) పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
కాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథ గురించి మాట్లాడుతూ 'ఈ చిత్రం కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. దీనిలో మొత్తం 6000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. నాటి రోజులకు తగినట్లు ఓ ప్రపంచాన్ని సృష్టించాం. అన్నిట్లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం' అని తెలిపాడు. ఇక ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటించనుండగా.. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, రానా, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com