Kalki 2898 AD Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్బ్ న్యూస్.. 'కల్కి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Friday,January 12 2024]

'సలార్' హిట్‌తో మంచి జోరు మీదున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న కల్కి-2898 AD చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ఈ ఏడాది వేసవి కానుకగా మే 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ చిత్రం నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్‌కి ఈ తేదీతో మంచి అనుబంధం ఉంది. గతంలో మే 9న విడుదలైన జగదేక వీరడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి.

ఇప్పుడు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అదే సెంటిమెంట్ రిపీట్ చేసేందుకు ఇదే తేదీన ప్రభాస్ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాలో పలు ఇండస్ట్రీలకు అతిరథ మహారథులు అందరూ నటిస్తున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తుండగా.. బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు పోషించడం విశేషం. అయితే ఈ సినిమా కథ భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకు తగట్లే గతంలో విడుదలైన గ్లింప్స్ వీడియో ఉంది.

కర్ణుడిని పోలిన పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని అంటున్నారు. అమితాబ్‌ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని చెబుతున్నారు. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ భారత సినీ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. అంతేకాకుండా గ్రాఫిక్స్, వీఎఫ్‌క్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అశ్వినిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఇకపై ప్రభాస్ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. ఇటీవల 'సలార్' మూవీతో ఇండియన్ బాక్సాఫీస్‌ను ప్రభాస్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా 'సలార్-2' త్వరలోనే రానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ చిత్రం హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగం పైగా పూర్తి అయింది. ఇవే కాకుండా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్, సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో మరో చిత్రం కూడా రానున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులకు అవధులు లేకుండా పోయాయి.

More News

Mahesh Babu: అభిమానులతో కలిసి 'గుంటూరు కారం' మూవీ చూసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. బాబు యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్‌లు ఇరగదీశాడంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Akshay Kumar: మెట్రో రైలులో ప్రయాణించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్

దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)లో ట్రాఫిక్ కష్టాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జెంట్ పని మీద సొంత వాహనాలు లేదా ప్రైవేట్ వాహనాల్లో రోడ్డు మీద వెళ్లాల్సి వస్తే గంటల మేర ట్రాఫిక్‌లో

పల్లెబాట పట్టిన నగరవాసులు.. రద్దీగా హైదరాబాద్-విజయవాడ హైవే..

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ 'సంక్రాంతి'. సంక్రాంతి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే పల్లెలు, పట్టణాలు పండుగకు సిద్ధమవుతూ ఉంటాయి.

Hanuman Vs Adipurush: 'హనుమాన్' వర్సెస్ 'ఆదిపురుష్'.. ప్రశాంత్‌ వర్మ దెబ్బకు ఓం రౌత్ అబ్బా..

టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తేజ సజ్జా హీరోగా ఆయన తెరకెక్కించిన 'హనుమాన్'(HanuMan) చిత్రం

వైసీపీ మూడో జాబితాలో రాయలసీమలోనే కీలక మార్పులు.. మంత్రులకు స్థానచలనం..

ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులకు ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 6 మంది ఎంపీలతో పాటు