ప్రేరణను పరిచయం చేసిన ప్రభాస్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. అయితే మంగళవారం ప్రభాస్ ఈ సినిమా నుంచి ప్రేరణను పరిచయం చేశారు. ప్రేరణ అంటే ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ‘రాధే శ్యామ్’లో ప్రభాస్‌కు జంటగా ఈ ముద్దగుమ్మ నటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం పూజా బర్త్‌డే కావడంతో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి పూజ లుక్‌ను పరిచయం చేశాడు.
షూటింగ్‌లో భాగంగా ఇటలీలోని ఓ ట్రైన్‌లో పూజ ప్రయాణిస్తున్నట్టుగా ఉన్న పిక్‌ను ప్రభాస్ రివీల్ చేశాడు. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్‌లో పూజ ఆకట్టుకుంటుండగా.. ఆమె ఎదురుగా ప్రభాస్ కూర్చొని ఉన్నాడు. పూజకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రభాస్ ప్రేరణ లుక్‌ను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు పూజకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అక్టోబర్ చివరి నాటికి చిత్రబృదం ‘రాధేశ్యామ్’ ఇటలీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇటలీలో తెరకెక్కుతున్న షెడ్యూల్‌లో ప్రభాస్, పూజాపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా ప్రభాస్, పూజ కలిసి నటిస్తున్నారు. కాగా.. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్, టీసిరీస్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com