ప్రభాస్.. ఇప్పుడు స్పీడున్నోడు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక సినిమా విడుదల కావడం.. మరో సినిమా సెట్స్ మీద ఉండటం, ఇంకో సినిమా ప్రారంభం కావడం.. మధ్యలో కథలు వినడం.. ఇవన్నీ స్పీడున్న హీరో లక్షణాలు. తాజాగా ప్రభాస్ ని చూసిన వారందరూ స్పీడున్నోడు అనే అంటున్నారు. అందుకు కారణం ఆయన చేస్తున్న తాజా సినిమాలు. ఆ మధ్య బాహుబలి విడుదలయ్యాక ఆయన సాహో సెట్స్ మీద జాయిన్ అయ్యారు.
ఇప్పుడు సాహో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ప్రభాస్ మరో సినిమాను ప్రారంభించనున్నారు. ఆ చిత్రం ఈ నెల 6న మొదలు కానుంది. ప్రభాస్ హీరోగా 'జిల్' దర్శకుడు రాధాకృష్ణ ఆ సినిమాను రూపొందించనున్నారు. తాజాగా సాహో సినిమాను తెరకెక్కిస్తోన్న యువీ క్రియేషన్స్ ఆ సినిమాను కూడా రూపొందించనుంది. ప్రభాస్ రెగ్యులర్ సినిమాలకు కాస్త భిన్నంగా ఆ సినిమా ఉంటుందట.
మురారి తరహాలో జాతకాలు వంటివాటిని అందులో స్పృశిస్తారట. ఎక్కువ భాగం ఇటలీలో షూటింగ్ జరుగుతుంది. పూజా హెగ్డే ఇందులో నాయిక. 1980 నేపథ్యంలో సాగుతుంది. ఆ లుక్‌కి, ఆ షేడ్స్ కి తగ్గట్టు ఉండే లొకేషన్లనే సెలక్ట్ చేసుకున్నారు. అయితే ప్రభాస్ మాత్రం సాహో తర్వాతే ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని వినికిడి. ఆయన లేకుండా మిగిలిన ఆర్టిస్టుల మీద తీయాల్సిన సన్నివేశాలను తెరకెక్కిస్తారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com