చైనాలో ప్రభాస్ సందడి
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి` సినిమా రిలీజ్ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజం చెప్పాలంటే ఓ రకంగా ఊపిరి లూది సినిమా స్పాన్ పెరిగేలా చేసింది. ఇండియన్ ఇండస్ట్రీలో 600 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. హలీవుడ్ పత్రికలు సైతం బాహుబలి` గురించి ప్రశంసించాయి. ఇక్కడ సందడి చేసిన బాహుబలి` త్వరలోనే చైనాలో సందడి చేయడానికి రెడీ అయిపోతుంది.
రాజమౌళి అండ్ టీమ్ బాహుబలి`ని ఇంటర్నేషనల్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలియజేశారు. అందులో భాగంగా ఇప్పుడు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం పీకే` చిత్రాన్ని విడుదల చేసిన ఈ స్టార్ ఫిలింస్` సంస్థ బాహుబలి చిత్రాన్ని నవంబర్ నెలలో భారీ రేంజ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments