చైనాలో ప్రభాస్ సందడి

  • IndiaGlitz, [Monday,September 14 2015]

బాహుబలి' సినిమా రిలీజ్ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజం చెప్పాలంటే ఓ రకంగా ఊపిరి లూది సినిమా స్పాన్ పెరిగేలా చేసింది. ఇండియన్ ఇండస్ట్రీలో 600 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. హలీవుడ్ పత్రికలు సైతం బాహుబలి' గురించి ప్రశంసించాయి. ఇక్కడ సందడి చేసిన బాహుబలి' త్వరలోనే చైనాలో సందడి చేయడానికి రెడీ అయిపోతుంది.

రాజమౌళి అండ్ టీమ్ బాహుబలి'ని ఇంటర్నేషనల్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలియజేశారు. అందులో భాగంగా ఇప్పుడు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం పీకే' చిత్రాన్ని విడుదల చేసిన ఈ స్టార్ ఫిలింస్' సంస్థ బాహుబలి చిత్రాన్ని నవంబర్ నెలలో భారీ రేంజ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందట.